calender_icon.png 5 July, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగుతనానికి ప్రతిరూపం రోశయ్య

05-07-2025 02:11:25 AM

  1. 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనది
  2. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ 
  3. రవీంద్రభారతిలో రోశయ్య 92వ జయంతి 
  4. అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం

హైదరాబాద్, సిటీబ్యూరో జూలై 4 (విజయ క్రాంతి): నిండైన తెలుగు తనానికి మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ప్రతిరూపమని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశ య్య 92వ జయంతిని శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ర్ట భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా స్పీకర్ ప్ర సాద్‌కుమార్ మాట్లాడుతూ.. రోశయ్య జ యంతిని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. ఇది గొప్ప రాజకీయ నేతకు దక్కిన సముచిత గౌరవమని పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డికి, రాష్ర్ట మంత్రి వర్గా నికి అభినందనలు తెలియజేశారు.

లక్డీకాపూల్‌లో విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా రోశ య్య గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేసిన వారమవుతామని చెప్పారు. దేశం లో రాష్ర్ట ఆర్థికమంత్రిగా అత్యధికంగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యకే దక్కిందన్నారు.

ముగ్గురు ముఖ్యమంత్రుల పరిపాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేకుండా సర్దుబాటు చేసిన ఘనత రోశయ్యది అని స్పీకర్ కొనియాడారు. నిండైన తెలుగు తనానికి రోశయ్య ప్ర తిరూపమని, పంచెకట్టు, భుజంపై పైపంచెతో ఆయన ఆహార్యం ఆకట్టుకునేదని అ న్నారు. ఈ సభా వేదికపై ప్రఖ్యాత ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును సన్మానించారు.