calender_icon.png 5 July, 2025 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దు

05-07-2025 02:13:42 AM

  1. ఇష్టానుసారం మాట్లాడొద్దు
  2. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానికంలో గెలవాలి 
  3.     30లోపు పార్టీ, నామినేటెడ్ పోస్టుల భర్తీ  
  4. పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే 

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి):  ‘పార్టీకి సంబంధించిన అంశాలపై ఇష్టానుసారంగా బయట ఎలాంటి విమర్శలు చేయ వద్దు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దు’ అని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హితవు పలికారు.   ఏమైనా సమస్యలుంటే పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన  సూచించారు.

పీసీసీ అధ్యక్షుడు మ హేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశానికి మల్లికార్జున ఖర్గే, మీనాక్షినటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పీసీసీ కార్యవర్గం హాజరైంది. ఈ సం దర్భంగా ఖర్గే మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ భారీ మెజార్టీతో గెలవాలన్నారు.

పార్టీలో పనిచేసిన వారికి, అర్హత ఉన్న వాళ్లకే పదవు లు ఇవ్వాలని సూచించారు. ఈ నెల 30 లో పు పోస్టులన్నీ భర్తీ చేయాలని, పదవులు భర్తీ కాకుంటే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌దే బాధ్యత అని  అన్నారు. ఆ సమయం లో సీఎం రేవంత్‌రెడ్డి కలుగజేసుకుని జిల్లా, నియోజకవర్గ స్థాయిలోని పదవుల భర్తీ బా ధ్యతను జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు బాధ్యత తీసుకుని ఆశావాహుల జాబితా సిద్ధం చేసి పీసీసీకి పంపాలని సూచించారు.  

రాజ్యాంగం మార్చడానికి కుట్ర

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి మరోసారి లబ్ధి పొందాలనే దుర్మార్గమైన ఆలోచన చేస్తోందని ఖర్గే మండిపడ్డారు. 50 ఏళ్ల క్రితం జరి గిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడే బీజేపీ నే త లు 11 ఏళ్లుగా బీజేపీ పాలనలో జరుగుతు న్న ఎమర్జెన్సీ పరిస్థితుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. కేంద్రంలో బీజేపీ, మోదీని ఇంట్లో కూర్చోబెడితేనే రా జ్యాంగం బతుకుతుందని అన్నారు.

రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తోందని విమర్శిం చారు. పార్టీ ఇచ్చిన పదవులను సద్విని యోగం చేసుకోవాలని, సమర్థులకు పదవులు ఇవ్వాలని సూచించారు. హామీలను అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని ఖర్గే వివరించారు. తెలంగాణలో పరిపాలన బాగుందని, పార్టీ కార్యకర్తల పనితీరు కూడా భేష్‌గా ఉందని ఖర్గే  అభినందిం చారు.

ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను ప్రభుత్వం అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. 

పదేళ్లు మనదే అధికారం: సీఎం రేవంత్‌రెడ్డి 

‘దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ర్టం ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్ర ప్ర భుత్వం మెడలు వంచి జనగణనలో కులగణన చేసేలా మనం విజయం సాధించాం. విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో మనం చా లా విజయాలు సాధించాం. నేను పీసీసీగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నాం. యూత్ కాంగ్రె స్, పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలామందికి  ప్రభుత్వంలో పదవులు వరించాయి.

పార్టీ పదవులను క్యాజువల్‌గా తీసుకోవద్దు. పార్టీ పదవులతోనే మీకు గుర్తింపు, గౌరవం, రాజకీయాల్లో మీ ఎదుగుదలకు ఇది ఉపయో గపడుతుంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరుగుతాయని తెలిపారు.  నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషను, జమిలి ఎన్నికలు ప్రభావితం చేయ బోతున్నాయని, నూతన నాయకత్వానికి 20 29  ఎన్నికలు వేదిక కావాలని సీఎం అ న్నా రు.

‘మీరు నాయకులుగా ఎదగాలంటే ఇ ప్పటి నుంచే కష్టపడాలి. గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించి సమన్వయంతో ప నిచేయాలి. పార్టీని రెండోసారి అధికారంలో కి తీసుకు రావాలి.  వచ్చే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం. సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా ఎన్నికైన అరుదైన ఘనత మల్లికార్జున ఖర్గేది. వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లా లి. పార్టీ పదవితోనే అందరికీ గౌరవం, గుర్తింపు వస్తుంది’ అని సీఎం వివరించారు.

 కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం: పీసీసీ చీఫ్   

 పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. మంత్రివర్గంలో నలుగురు దళితులకు అవకాశం దక్కిందని, స్పీకర్‌గా దళిత బిడ్డను ఎంపిక చేసి గౌరవించిందని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధితో పార్టీ మరోసారి 90 సీట్లతో అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పార్టీ శ్రేణులు పని చేయాలని  సూచించారు.