4 April, 2026 | 3:24 AM

రాయల్స్ వర్సెస్ టైటాన్స్

04-04-2026 01:35 AM

వైభవ్‌పైనే అందరి చూపు

సొంతగడ్డపై గుజరాత్‌కు సవాల్

అహ్మదాబాద్, ఏప్రిల్ 3: ఐపీఎల్ 19వ సీజన్‌లో తొలి డబుల్ హెడర్ రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి. చైన్నైని చిత్తు చేసి ఈ సీజన్‌ను ఘనవిజయంతో ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ మరో విజయంపై కన్నేసింది. ఆ జట్టు చిచ్చర పిడుగు వైభవ్ సూర్య వంశీపైనే అందరి చూపు ఉంది. గత ఏడాది అరంగేట్రంలోనే సంచలన ఇన్నింగ్స్‌లతో మెరిసిన వైభవ్ ఈ సీజన్‌ను కూడా అద్భుతంగా మొదలుపెట్టాడు. కేవలం 17 బంతు ల్లోనే 52 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ యువ బ్యాటర్‌ను గుజరాత్ బౌలర్లు ఎలా అడ్డుకుంటారనేది చూడాలి. అలాగే జైశ్వాల్ కూడా ఫామ్ అందుకున్నా డు. మిగిలిన బ్యాటింగ్ లైనప్‌లో జురెల్, పరాగ్ , హెట్ మెయిర్ లాంటి హిట్టర్లు రాజస్థాన్‌కు బలం. అటు బౌలింగ్ పరంగానూ రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు పేసర్లు ఆర్చర్, బర్గర్ చెన్నై బ్యాటర్లను వణికించారు.

అలాగే జడే జా లాంటి సీనియర్ ఆల్ రౌండర్ కూడా రాయల్స్‌కు అడ్వాంటేజ్. సందీప్ శర్మ, బ్రిజే ష్, రవి బిష్ణోయ్‌లతో రాజస్థాన్ బౌలింగ్ బ లంగా ఉంది. అయితే బ్యాటింగ్‌కు అనుకూలించే అహ్మదాబాద్ స్టేడియంలో వీరు ఎలా రాణిస్తారనేది చూడాలి. విన్నింగ్ కాం బినేషన్‌ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఈ సీజన్‌ను గుజరాత్ టైటాన్స్ ఓటమితో ఆరంభించింది.

పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైన గుజరాత్ సీజన్‌లో తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. గత మ్యాచ్‌లో టాపార్డర్ రాణించి నా మిగిలిన బ్యాటర్లు నిరాశపరిచారు. ఫలితంగా తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. బ్యాటింగ్‌లో గిల్, బట్లర్, సాయిసుదర్శన్ కీలకం కానున్నారు. అలాగే గ్లెన్ ఫి లిప్స్,  షారూఖ్‌ఖాన్ కూడా అంచనాలకు త గ్గట్టు రాణిస్తే గుజరాత్ సొంతగడ్డపై గెలుపు బాట పట్టొచ్చు. 

గత రికార్డులు

 గత రికార్డుల పరంగా చూస్తే గుజరాత్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 8 మ్యాచ్‌లలో తలపడితే ౬ సార్లు గుజరాత్ గెలిచింది. రాజస్థాన్ ౨ విజయాలు మాత్రమే సాధించింది. 

పిచ్ రిపోర్ట్

పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అంచనా. ఛేజింగ్ జట్టుకే ఎక్కువ విజ యావకాశాలు ఉండడంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్‌కే మొగ్గుచూపుతుంది.

తుది జట్లు అంచనా

రాజస్థాన్ రాయల్స్ : జైశ్వాల్, వైభవ్ సూర్యవంశీ, జురెల్ (కీపర్), పరాగ్ (కెప్టెన్), హెట్‌మెయిన్, జడేజా, బిష్ణోయ్, ఆర్చ ర్, బిష్ణోయ్, బర్గర్, సందీప్ 

గుజరాత్ టైటాన్స్ : గిల్(కెప్టెన్), సాయిసుదర్శన్, బట్లర్ (కీపర్), ఫిలిప్స్, సుందర్, షారూఖ్ ఖాన్, రాహుల్, రషీద్‌ఖాన్, కగిసో రబాడ, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ