క్షుద్రపూజల పేరుతో రూ 62 లక్షల మోసం
- ఇద్దరు నిందితుల అరెస్ట్
- రూ.30.50 లక్షల నగదు స్వాధీనం
సిరిసిల్ల, ఆగస్ట్ 31, (విజయక్రాంతి): క్షుద్రపూజలు, మంత్రాలు, చేతబడుల పేరుతో అ మాయకులను మోసం చేస్తున్న ఇద్దరిని సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేశారు. క్షుద్రపూజల తో అనారోగ్యం నయం చేస్తామని ఓ మహిళను నమ్మించి సుమారు రూ.62 లక్షలు వ సూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్‌కు చెందిన తురుపాటి శ్యాంకుమార్, వేములవాడ అర్బన్ మండలం అగ్రహారానికి చెందిన పత్తెం లక్ష్మీరాజం (Pattem Lakshmi Rajam) కలి సి ఈ మో సానికి పాల్పడినట్లు వెల్లడించారు.
బాధితురాలి నుంచి నగదు, బ్యాంకు బదిలీల ద్వారా డబ్బులు తీసుకున్నారని, అనంతరం డబ్బు లు తిరిగి ఇవ్వాలని కోరగా బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు.ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అగ్రహారంలోని లక్ష్మీరాజం ఇంటి వద్ద ఇద్దరినీ అదుపు లోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 30.50 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు, రెం డు బెల్లం బొమ్మలు, పసుపు, కుంకుమ తదితర పూజా సామాగ్రిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.






