calender_icon.png 4 December, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికలాంగుల సహాయార్థం ఏటా రూ. 2 లక్షలు అందిస్తా

04-12-2025 01:35:08 AM

రోటరీ క్లబ్ సేవలు అమోఘం

నిజామాబాద్, డిసెంబర్ 3 (విజయ క్రాంతి): రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ సంయుక్త ఆధ్వర్యంలో నిజామాబాద్ రోటరీ సర్వీసెస్ ట్రస్ట్ వారి సహకారంతో ప్రపంచ దివ్యాంగు ల దినోత్సవం సందర్భంగా ఉచిత జైపూర్ ఫుట్ కృత్రిమ కాలు పంపిణీ శిబిరం నిర్వహించారు. వారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ  హాజరై దివ్యాంగులకు కృత్రిమ కాలును అందజేసి ఆశీర్వదించారు.

ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రోటరీ క్లబ్ వారు చేస్తున్న సేవ  దివ్యాంగుల జీవితల్లో వెలుగులను తీసుకొని వస్తుందన్నారు. రోటరీ క్లబ్ ట్రస్ట్  వారు 2009 నుండి సేవ కార్యక్రమలు చేయడం అభినందనీయం.. దివ్యాంగులకు కృత్రిమ కాలును అమర్చి వారికి నూతన ఉత్తేజాన్ని కల్పిస్తున్న ఈ రోటరీ క్లబ్ ట్రస్ట్ వారి సేవ అభినందనీయమని కొనియాడారు. దివ్యాంగుల పునరావాసం, సాధికారత కోసం రోటరీ చేస్తున్న సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. సమాజంలో దివ్యాంగుల పట్ల సహానుభూతితో అందరూ ముందుకొస్తే వారి జీవితాల్లో వెలుగు వస్తుంది అని తెలిపారు.

ఈ సందర్భంగా, నిజామాబాద్ రోటరీ సర్వీసెస్ ట్రస్ట్కు ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే గారి ట్రస్ట్ ద్వారా  రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తానని సభాముఖంగా ఆయన ప్రకటించారు.   అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా  ఎటువంటి సహాయ సహకారాల కైనా తనను సాంప్రదించే తప్పకుండా తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ నిర్ణయం సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఆర్ సి టి చైర్మన్ ఆకుల అశోక్ , రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్ కార్యదర్శి గోవింద్ జవహర్ కోశాధికారి జుగల్ రాజు బీజేపీ నాయకులు, లబ్ధిదారులు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..