04-12-2025 01:36:41 AM
మహబూబాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): జవహర్ న వోదయ విద్యాలయం వరంగల్ లో 2026-27 విద్యా సంవత్సరం లో ఆరవ తరగతిలో ప్రవేశం కొరకు ఈనెల 13న ప్రవేశ పరీక్ష ఉమ్మడి వరంగల్ జిల్లాలో 28 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు విద్యాలయ ప్రధానాచార్యులు బి.పూర్ణిమ తెలి పారు. ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా 5,648 మంది అభ్యర్దులు దరఖాస్తు చేసుకున్నారన్నారు.
ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్ లైన్ www.navodaya. gov.in ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని, ఇందుకు గాను అభ్యర్థులు సంబంధిత వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకొనేటప్పుడు వచ్చిన రిజిస్టేషన్ నెంబర్, పుట్టిన తేదీని సమర్పించి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారు విద్యాలయ హెల్ప్ లైన్ నెంబర్ 9110782213 కి ఫోన్ చేసి తమ వివరాలు తెలిపి హాల్ టికెట్ ను పొందవచ్చని ఆమె పేర్కొన్నారు.