calender_icon.png 4 December, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలరించిన ఆర్‌బీవీఆర్‌ఆర్ హైస్కూల్ విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శన

04-12-2025 01:33:31 AM

నిజామాబాద్ డిసెంబర్ 3 (విజయ క్రాంతి): నిజామాబాద్ ఆర్ బి వి ఆర్ ఆర్ హైస్కూల్లో విజ్ఞాన్ మేళాలో విద్యార్థులు సైన్స్, సోషల్, బయాలజీ, గణితం, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, యోగా, బోటానికల్ గార్డెన్ వంటి విభాగాల్లో తాము తయారుచేసిన ప్రాజెక్టులు ప్రదర్శించారు. 

బుధవారం రోజు జిల్లా కేంద్రం ఆర్ బి వి ఆర్ ఆర్ స్కూల్ ఆధ్వర్యంలో  నిర్వహించిన విజ్ఞాన్ మేళా 2025-26 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి  అధ్యక్షులు విశిష్ట అతిథి, జిల్లా పబ్లిక్ ప్రాసికూ టర్ రాజేందర్ రెడ్డి కమిటీ సభ్యులతో కలిసి విజ్ఞాన్ మేళా 20252026 ను ప్రారంభించరూ..విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ఎక్సపరిమెంట్లను ప్రాజెక్టులను సందర్శించారు.

ఈ మేళాలో ఎల్ కే జి నుండి 10.వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు లపై వారితో మాట్లాడి, ప్రాజెక్టులకు సంబంధించి వాటి ఉపయోగం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మరికొందరు విద్యార్థులు అదనంగా, వైద్య సంబంధిత పరీక్షలను ప్రదర్శించారు చైర్మన్ విద్యార్థులతో కలిసి బ్లడ్ టెస్ట్ ప్రక్రియను పరిశీలించి వారిని అభినందించారు.

అనంతరం నిర్వహించిన సమావేశం లో చైర్మన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రదర్శించిన ప్రాజెకట్స్ చాలా చక్కగా తయారు చేశారని ఉపయోగం సమాజంలో ఎంతగా నో ఉంటుం దన్నారు. విద్యార్థులచే ఈ విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేయించినస్కూల్  స్కూల్ స్కూల్ ఉపాధ్యాయులను వారు అభినందించారు.

ఆర్ బి వి ఆర్ ఆర్ హై స్కూల్ చాలా అభివృద్ధిలో ముందుకు సాగుతోందని  రాష్ట్ర స్థాయిలో ఆర్ బి బి ఆర్ ఆర్ పాఠశాలకి  ప్రధమ స్థానం  లభించాలని వారు ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో ఆర్ బి వి ఆర్ ఆర్ హైస్కూల్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి , కార్యదర్శి వెంకట రమణ రెడ్డి  స్కూల్ చైర్మన్ జగత్ రెడ్డి , కమిటీ మెంబెర్స్, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.