27-10-2025 04:24:30 PM
కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎలుగూరి గోవిందు
తుంగతుర్తి (విజయక్రాంతి): కల్లు గీత వృత్తిపై ఆధారపడి దుర్భర జీవనాన్ని కొనసాగిస్తున్న గీత కార్మికుల సంక్షేమం కోసం ' గీతన్న బంధు' ప్రకటించి కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కల్లుగీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎలుగూరి గోవిందు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో మండల అధ్యక్షుడు మద్దెల నరసయ్య ఆధ్వర్యంలో జిల్లా నాలుగవ మహాసభలను నిర్వహించారు అనంతరం గీతా కార్మికుల సోదరులంతా ర్యాలీ నిర్వహించి ,సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన గీత కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ... కల్లుగీత వృత్తికి అండగా నిలిచిన(కంఠ మహేశ్వరుడు) స్ఫూర్తితో కల్లుగీత కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.అమరు డు బొమ్మగాని ధర్మ బిక్షం, యన్ ఆర్ దాట్ల నాయకత్వంలో 1957లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్మిక సంఘం మొదటి రాష్ట్ర మహాసభ నిర్వహించినట్లు తెలిపారు. గ్రామాల్లో వేలంపాట విధానం రద్దుచేసి ,సొసైటీలు ఏర్పాటు చేయాలని మహి పూజ్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చెట్టుపై హక్కు మాకు ఉండాలని భూస్వాములు ఆగడాలు అరికట్టాలని వృత్తిలో ప్రమాదం జరిగిన వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్లపై అనేక పోరాటాలు చేసి విజయం సాధించినట్లు తెలిపారు.
బహుళ జాతి కంపెనీల లిక్కర్, శీతల పానీయాల ఉత్పత్తుల దాటికి తట్టుకోలేక కల్లు అమ్మకాలు పడిపోయాయని, ఫలితంగా గీత వృత్తిలో ఉపాధి దొరకక బ్రతుకుతెరువు కోసం ఇతర పనులు వెతుక్కుంటూ పట్టణాలకు వలస బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆసరా పెన్షన్లు, ఎక్స్గ్రేషియాతో సరిపెట్టకుండా ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర కళ్ళుగీత కార్పోరేషన్ కు ప్రభుత్వం రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించారని డిమాండ్ చేశారు. ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని, ఉన్న 560 జీవో అమలు చేయాలి లేదా కొనివ్వాలని డిమాండ్ చేశారు.
కొత్త గ్రామ పంచాయతీలలో చెట్లు గీత కార్మికులు ఉన్నచోట సొసైటీలకు అవకాశం కల్పించాలన్నారు.ప్రతి గ్రామంలో కమ్యూనిటీ భవనం నిర్మాణంతో గీతన్న బంధు ప్రకటించి పాటు, 10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మడ్డి అంజిబాబు, తుంగతుర్తి మండల అధ్యక్షుడు నరసయ్య గౌడ్ తణుకు సైదులు గౌడ్, ఆకుల రమేష్, చిర్ర నరేష్, గౌడ సంఘం నాయకులు తునికి సాయిలు, బుర్ర శ్రీనివాస్, గుండ గాని అంజయ్య, గడ్డం ఉప్పలయ్య, సూదగాని రాజయ్య, మారగాని వెంకటయ్య, మల్లయ్య గౌడ్ ఉప్పలయ్య గౌడ్ వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.