27-10-2025 04:26:40 PM
పిడిఎఫ్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీకాంత్..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని డిగ్రీ కళాశాలలో పిడిఎఫ్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వం నిర్వహించి డిగ్రీ విద్యార్థుల ఫీజుల తేదీలను పెంచాలని సోమవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పిడిఎఫ్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ... కాకతీయ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఫీజులు సోమవారం తో ముగించడంతో మిగతా విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. బడుగు, బలహీన, వర్గాల విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే డిగ్రీ విద్యార్థుల ఫీజుల తేదీలను పొడిగించి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా నాయకులు కార్తీక్, అజయ్, ఆంజనేయులు, విజయ్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.