calender_icon.png 27 October, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్కింగ్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ

27-10-2025 03:53:15 PM

మందమర్రి,(విజయక్రాంతి): ఏరియాలోని వర్క్ షాప్ కార్మికుల సౌకర్యార్థం నూతన మోటార్ సైకిల్ స్టాండ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. వర్క్ షాప్ ఆవరణలో సోమవారం ఎఐటియుసి నాయకులు మోటర్ సైకిల్ స్టాండ్ నిర్మాణానికి పూజలు నిర్వహించి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎఐటీయుసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు భీమనాధుని సుదర్శన్ మాట్లాడుతూ వర్క్ షాప్ ఆవరణలో ఇదివరకు ఉన్న  మోటార్ సైకిల్ స్టాండ్ కార్మికులకు సరిపోవడం లేదని నూతనంగా మరో స్టాండ్ నిర్మాణం చేపట్టాలని గుర్తింపు సంఘం ప్రతిపాదన మేరకు ఏరియా అధికారులు నూతన మోటార్ సైకిల్ స్టాండ్ నిర్మాణానికి అంగీకరించడంతో నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. గుర్తింపు సంఘం ఏఐటియుసి కార్మికుల హక్కుల సాధనతో పాటు వారి సంక్షేమానికి నిర్విరామంగా  కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.