10 April, 2026 | 4:47 PM

Breaking News

సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •   మావోయిస్ట్ పార్టీకి మరో బిగ్ షాక్— లొంగిపోయిన 42 మంది కీలక మావోయిస్టులు   •   కాలభైరవ ఆలయంలో పూజలు   •  

చెట్టును ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ దుర్మరణం

16-02-2026 08:11 PM

కందుకూరు,(విజయక్రాంతి): విధులు నిర్వహించుకొని ఇంటికి తిరిగి తన పల్సర్ బైక్ పై వస్తుండగా చెట్టుకు ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. ఈఘటనకు సంబంధించి కందుకూరు సిఐ సీతారాం కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కందుకూరు మండల పరిధిలోని నేదునూరు గ్రామానికి చెందిన నల్లి శ్రీనివాస్ (37)రోజు విధంగానే మహేశ్వరం నుండి బస్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న నేపథ్యంలో పులిమామిడి బాచుపల్లి మధ్యలో తన పల్సర్ బైక్ టీఎస్ 07 జీడీ 1475 వస్తున్న నేపథ్యంలో సుమారు 11 గంటల ప్రాంతంలో మయూరి ఫామ్ హౌస్ సమీపంలో ఎడమవైపు ఉన్న మలుపు వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డుకు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో వాహనంపై నుంచి పడి ఆయన తలకుకాళ్లకు తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోని ఆయన మృతి చెందినట్లు సిఐ పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రయాణికులు వారి కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

కుటుంబ సభ్యులు పరిశీలించిన అనంతరం ఆయన మృతి చెందినట్లు నిర్ధారించుకొని స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలికి కందుకూరు పోలీసులు చేరుకొని మృతుడి భార్య నల్లి అశ్విని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.రాత్రి సమయంలో రహదారులపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్,సీట్‌బెల్ట్ ధరించాలి.యూ-టర్న్‌లు, మలుపుల వద్ద నెమ్మదిగా ప్రయాణించాలి.