calender_icon.png 9 September, 2025 | 6:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ ప్రయాణం.. అయోమయం

09-09-2025 12:19:53 AM

  1. ప్రమాదాల్లో డిపో ప్రగతి రథాలు

పని ఒత్తిడిలో డ్రైవర్లు, కండక్టర్లు

డిపోను వెంటాడుతున్న ప్రమాదాలు

భారంగా మారిన సురక్షిత ప్రయాణం 

అధికారుల తీరుపై పెదవి విరుస్తున్న ప్రయాణికులు

మణుగూరు, సెప్టెంబర్ 8, (విజయక్రాంతి) :ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షిత ప్రయాణానికి చిరునామా. అయితే అదంతా గతం.. ప్రస్తుతం మణుగూరు ఆర్టీసీ డిపో బ స్సులలో ప్రయాణం అంటే నరకయానం అ ని, ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మా రింది.

అధికారుల చర్యల కారణంగా విశ్రాం తి లేని విధులు, ఫిట్నెస్ లేని బస్సులు, గో తుల రోడ్లు, డ్రైవర్ల అతివేగం వెరసి వరస ప్ర మాదాలతో ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

డిపోకు చెం దిన ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు నెలకు రెండు, మూడు సార్లు ఎక్కడో ఒక చోట వరుస ప్ర మాదాలకుగురవుతున్నాయి. దీంతో ఆర్టీసీ బస్సులలో గమ్యానికి చేరే..ప్రయాణం అగ మ్య గోచరంగా మారింది. ప్రయాణికుల ఇబ్బందులపై విజ య క్రాంతి కథనం..

ప్రయాణం... అయోమయం..

మణుగూరు డిపోకు చెందిన బస్సులు వరుస ప్రమాదాల బారిన చిక్కుకోవడంమే కాకుండా రహదారులపై అకస్మాత్తుగా బ స్సులు ఆగి పోవడం, పెద్ద పెద్ద శబ్దాలు రా వడం, టైర్లు,కిటికీ అద్దాలు ఊడిపోవడం, అ దుపు తప్పడం వంటి సమస్యలు తరచూ తలెత్తుతున్నాయి.

అటు డిపోలో పని చేసే కార్మికులతో పాటు బస్సులు ఎక్కి రాక పో కలు చేసే ప్రయాణికుల వరకు గమ్య స్ధానాలను దిగేంత వరకు సురక్షితంగా చేరుకో గలమా లేదా మరే ప్రమాదాల్లో చిక్కు కుం టామా అన్న సందిగ్ధ పరిస్ధితులు చవిచూడా ల్సి వస్తోంది. డిపోకు చెందిన బస్సులు ఎక్కడ పడితే అక్కడ అనేక సార్లు ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందు లకు గురవుతున్నారు.

ప్రమాదాల్లో డిపో ప్రగతి రథాలు

మణుగూరు డిపోలో 42 సంస్థకు చెం దిన ఆర్టీసీ బస్ లు ఉండగా 34 అద్దె బస్సులతో ఆర్టీసీ యాజమాన్యం ఒప్పందం చేసు కున్నది. ఈ బస్సుల ద్వారా వివిధ ప్రాంతాలకు సర్వీసులతో వేలాది మందిని గమ్యస్థానాలకు ఆర్టీసీ చేరావేస్తుంది. ఇటీవల జరుగు తున్న వరుస ఘటనలతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. గత కొన్ని నె లల క్రితం తోగూడెం సమీపంలో డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి.

తాజాగా మిట్టగూడెం గ్రామ వ ద్ద సోమవారం జరిగిన ఘటనలో డ్రైవర్ అ ప్రమత్తంగా ఉండటం  తో భారీ ప్రమాదం తప్పింది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసే మణుగూరు డిపోలో ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నా యి. దారుణంగా మారినరహదారులు, ఎ దురుగా వచ్చే వాహనా లతప్పిదం, చోదకు లు ఒత్తిడికి గురవడం ప్రమాదాలకు కారణ మవుతున్నాయి.

పని ఒత్తిడిలో ఉద్యోగులు అధికారులు ప్రస్తుతం డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితు లు, బస్సుల కండిషన్ పట్టించుకోకుండాఆదాయం పైనే దృష్టి సారిస్తున్నారు. దశాబ్దా ల కాలంగా లక్షలాది కిలో  మీటర్లు తిరిగిన బస్సులను మర మ్మతులు చేస్తూ నడిపిస్తున్నారు. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు అ నుగుణంగా బస్సుల సంఖ్య పెరగడం లేదు. దీనికి తోడు అప్పట్లో 8 గంటల డ్యూటీ చేసి ఇంటికి వెళ్లే డ్రైవర్లు, కండక్టర్లు ఇప్పుడు 12 గంటలు ఆగకుండా చేయాలి.

మరుసటి రో జు మళ్లీ డ్యూటీకి వెళ్లి ,మరో 12 గంటలు చే యాల్సిందే. ప్రమాదాల నివారణపై దృష్టి -పెట్టాల్సిన ఆర్టీసీ అధికారులు అది మా పని కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.నామమాత్రంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రు.

చాలా మంది కొత్త డ్రైవర్లలో సరైన నైపు ణ్యం ఉండటం లేదు. వీటికి తోడు కాలం చె ల్లిన బస్సుల కారణంగా ప్రమాదాలను అదు పు చేయటంలో డ్రైవర్లు విఫలమవుతున్నా రు. ఇప్పటికైనా  ఆర్టీసీ ఉన్నత అధికారులు వరుస ప్రమాదాలను దృష్టి కేంద్రీకరించి ప్ర యాణికుల భద్రతను కాపాడాలని పలువురు కోరుతున్నారు.

ప్రతిరోజు మరమ్మతులు

డిపో నుంచి బస్సు బయటకు వెళ్లే అన్ని విధాలుగా పరిశీలిస్తాం. ఏమైనా సమస్యలుంటే వాటికి మరమ్మతులు చేపడతాం. మిట్టగూడెం వద్ద జరిగిన ప్రమాదంపై విచారణ చేపడతాం. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాం

 శ్యాంసుందర్ డిపో మేనేజర్  మణుగూరు