29 May, 2026 | 7:59 PM

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆర్టీఐ కమిషనర్లు

29-05-2026 04:50 PM

హైదరాబాద్: రాష్ట్ర సమాచార (హక్కు) కమిషన్ చీఫ్ కమిషనర్, కమిషనర్లు(RTI Commissioners ) ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy) జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్‌లో బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి ఆర్టీఐ కార్యకలాపాలపై వివరించారు. సీఎంను కలిసిన వారిలో రాష్ట్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్ జి. చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు పీవీ శ్రీనివాస్, బోరెడ్డి అయోధ్య రెడ్డి, దేశాల భూపాల్ ఉన్నారు.