07-12-2025 08:36:45 AM
గోవా: ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలోని ఓ ప్రముఖ నైట్ క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బిర్చ్ నైట్ క్లబ్‌లో సిలిండర్ పేలి 25 మంది మరణించారని అధికారులు ఆదివారం తెలిపారు. ఈ నైట్‌క్లబ్ గోవా రాజధాని పనాజీ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... బాధితుల్లో ఎక్కువ మంది వంటగది సిబ్బంది కాగా, మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అతికష్టం మీద మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనకు సిలిండర్ పేలుడే కారణమని గోవా డీజీపీ అలోక్ కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గతేడాది నైట్ క్లబ్ ను ప్రారంభించారని గోవా డీజీపీ తెలిపారు.