భారత్‌కు రష్యా బాసట!
95 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరాకు మిత్రదేశం సిద్ధం
కొన్ని వారాల్లోనే భారత్‌కు రష్యా చమురు నౌకలు
ఢిల్లీ, మార్చి 5 : ఆపత్కాలంలో భారత్‌కు మిత్రదేశం రష్యా బాసటగా నిలిచింది. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ చమురు నిల్వలు భారత్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరో వైపు చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న ఇలాంటి తరుణంలో రష్యా మరోసారి భారత్‌కు అండగా నిలిచింది.
భారత్‌కు ముడి చమురును మళ్లించడానికి రష్యా సిద్ధంగా ఉంది. ఏకంగా 95 లక్షల బ్యారెళ్ల చమురు కొన్ని వారాల్లోనే భారత్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసి ంది.ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్న నేపథ్యంలో హోర్మోజ్ జలసంధి నుంచి చమురు రవాణా నిలిచిపోయింది.
భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు లో దాదాపు 40శాతం హోర్మోజ్ ద్వారా జరుగుతోంది. భారత్ వద్ద ప్రస్తుతం కేవలం 25 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు ముడి చమురును మళ్లించడానికి రష్యా సిద్ధమైనట్టు తెలిసింది. భారతీయ సముద్ర జలా లకు సమీపంలోనే ఉన్న నౌకలలోని దాదాపు 95 లక్షల బ్యారెళ్ల చమురు కొన్ని వారాల్లోనే భారత్ చేరుకోగలదని పరిశ్రమ వర్గాలు రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపాయి. కొన్ని వారాల్లోనే ఈ చమురు నౌకలు భారత్ చేరుకుంటాయని మాత్రం వారు వెల్లడించారు.




