28 March, 2026 | 2:16 PM

Breaking News

కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాన్ని వాకౌట్ చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు   •   రాజాపూర్ తైబజార్ వేలం   •   విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. ట్రాక్టర్ బాడీపైనే ట్రాన్స్‌ఫార్మర్లు.!   •   పత్తి గోదాంలో అగ్ని ప్రమాదం   •   ప్రభుత్వ స్థల వివాదం – గుడి నిర్మాణానికి అడ్డంకులు, అధికారులకు వినతి   •   తుంగతుర్తి లోక్‌అదాలత్‌లో ఒకటైన జంట   •   ఇంటింటికీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ   •   సింగరేణి ఉత్పత్తి లక్ష్యంలో సత్తుపల్లి అగ్రగామి   •   ఏం అచ్చెమ్మ అత్త బాగున్నావా..! ఆప్యాయంగా పలకరించిన మంత్రి తుమ్మల   •   నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు: మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్   •  

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి

14-04-2025 11:33 PM

34 మంది మృతి, 117 మందికి గాయాలు..

ఉక్రెయిన్‌కు రావాలని ట్రంప్‌కు జెలెన్ స్కీ వినతి..

కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి క్షిపణి దాడులకు పాల్పడింది. సుమీ నగరంలో ఆదివారం రెండు బాలిస్టిక్ మిసైల్స్‌తో జరిపిన దాడిలో 34 మంది మృత్యువాత పడగా.. 117 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు ధ్రువీకరించారు. ఉదయం 10.15 గంటల సమయంలో జనావాసాలున్న ప్రాంతంలో పామ్ సండే వేడుకల్లో పాల్గొన్న వారిపై క్షిపణులు పడ్డాయి. వీటి పేలుడు తీవ్రతకు ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ కమ్ముకుని ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది.

కాగా రష్యా దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మండిపడ్డారు. రష్యాను ఉగ్రవాదిగా పరిగణిస్తూ చర్యలు తీసుకోవాలని పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తున్నారంటూ రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఆరోపణలు చేసుకున్న మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అంతకుముందు జెలెన్ స్కీ.. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉక్రెయిన్‌కు రావాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం.