ఖాకీ కర్కశత్వం
మహబూబాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలో..
గొంతు నులిమిన సీఐ రఘుపతిరెడ్డి
సహనం కోల్పోయి.. విరుచుకుపాటు
మహబూబాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): పాలిటెక్నిక్ విద్యార్థులకు శాపంగా మారనున్న జీవో 97ను రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ డీఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొన్న విద్యార్థుల గొంతును పట్టణ సీఐ రఘుపతిరెడ్డి నులపడం తీవ్ర విమర్శలకు దారితీసింది. జిల్లా పరిధిలోని పాలిటెక్నిక్ విద్యార్థులు బుధవారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు.
ఈ సందర్భంగా శక్తి కార్యక్రమాన్ని పాలిటెక్నిక్ విద్యార్థులకు అమలు చేయవద్దం టూ పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ రఘుపతిరెడ్డి విద్యార్థులను నిలువరించడానికి ముందుకు దూసుకెళ్లి నినాదాలు చేస్తున్న విద్యార్థుల గొంతుపై రెండు చేతులతో గట్టిగా నొక్కి కొద్దిసేపు ఊపిరి ఆడ కుండా చేశారు. విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసం గట్టిగా నినాదాలు చేస్తే ఇంత కర్కశంగా వ్యవహరించ డం సరికాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






