బర్తరఫ్ చేయాలి
- మాటమార్చిన మంత్రి పొంగులేటి
- 22 ఏ బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పోరాటం
- తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ లీగల్ సెల్
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): 22 ఏ నిషేధిత భూములపై బాధి తులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పోరాడుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటికి రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే.. బీఆర్‌ఎస్‌కు పోరాటం తెలుసన్నారు. 22 ఏ విషయంలో పది రోజుల్లోనే మంత్రి పొంగులేటి మాట మార్చారని, 10 రోజు ల క్రితం ఒక్క ఎకరా కూడా 22ఏ లో పెట్టలేదని చెప్పిన మంత్రి.. ఇప్పుడు క్షమాప ణలు ఎలా చెపుతున్నారని మండిపడ్డారు.
నిషేధిత జాబితా గురించి 4 నెలల క్రితమే సీఎంకు చెప్పానని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారని, మరి అప్పుడే సీఎం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఇదంతా సీఎం, మంత్రికి తెలియకుండానే జరుగుతోందా.. సీఎంకు ఈ విషయం తెలియకపోతే పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో 22ఏ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ బాధితులు హరీశ్‌రావును కలిసి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈ సమస్యను పరిష్కరిస్తారా లేక ప్రజల కాళ్ల కింద నలిగి పోతారా? అని ప్రభుత్వా న్ని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ జనతా గ్యారేజీగా మారి బాధితులకు భరోసా ఇస్తుందని తెలిపారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేసి 10 మంది న్యాయవాదులతో ఉచిత న్యా య సహాయం అందజేస్తామన్నారు. కాంగ్రె స్ సర్కారు అడ్డగోలు నిర్ణయాలతో సామా న్య కుటుంబాలు రోడ్డున పడ్డాయని, హిల్ట్ పాలసీ తీసుకొచ్చి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
మేడ్చల్, రంగా రెడ్డి ప్రజలు హాయిగా నిద్రపోయే పరిస్థితి లేదన్నారు. కోట్లాది ప్రజల ఆస్తులను పెట్టే ధైర్యం అధికారులకు ఉంటుందా? చీటికి మాటికి విచారణలు చేసే రేవంత్‌రెడ్డి దీనిపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. 30 శాతం కమీషన్లు, 50:50 సెటిల్మెంట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ భూములను 22 లో పెట్టిందని ఆరోపించారు. యాదాద్రిలో 40 వేల ఎకరాలు 22ఏ లో పెట్టారని మంత్రి కోమటిరెడ్డి చెప్పినా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని ప్రశ్నించారు.
మంత్రి పొంగులేటి లక్షలాది మంది జీవితాలను రోడ్డున పడేశారని విమర్శించారు. హూడా, హెచ్‌ఎమ్‌డీఏ అప్రూ వ్‌డ్ లేఅవుట్లలో, 30 ఏళ్ల క్రితం కొనుక్కున్న ఇళ్లను కూడా ఇప్పుడు 22 లో పెట్టారంటే.. దీని వెనుక ఎంత పెద్ద కమీషన్ల దందా నడుస్తోందో అర్థమవుతోందన్నారు. బుద్వేల్ గ్రామం సర్వే నంబర్ 282, 283, 284 లలోని 30 ఎకరాల భూమి కోసం సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి రాత్రికి రాత్రే 22 నుంచి క్లియర్ చేసి కోట్లాది రూపాయల దందా చేశారని ఆరోపించారు.
శేరిలింగంపల్లి సర్వే నంబర్ 20/1, 21 లో ఎస్‌ఏఎస్ ఇన్‌ప్రా ప్రాపర్టీకి 30 శాతం కమీషన్ తీసుకుని 22 నుంచి క్లియర్ చేసి రిజిస్ట్రేషన్లు చేయించారని, బిల్డర్ పని అయిపోయాక మళ్లీ 10 రోజుల క్రితం దాన్ని 22 లోకి మార్చారని మండిపడ్డారు. సంగారెడ్డి సమీపంలో శిల్పా మోహన్‌రెడ్డి భూమిని 22 నుంచి తీసి రిజిస్ట్రేషన్లు చేశాక.. సీఎం రేవంత్‌రెడ్డికి తెలిసి మళ్లీ 22ఏ లో పెట్టించారన్నారు.
అమీన్‌పూర్ కేఎస్‌ఆర్ కాలనీలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ 500 ఇళ్లను 22ఏ లో పెట్టి కాలనీవాసులను ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. 2008లోనే డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సీలింగ్ రద్దయి, హెచ్‌ఎమ్‌డీఏ, జీహెచ్‌ఎంసీ పర్మిషన్లతో కట్టుకున్న ఇళ్లను కూడా ఇప్పుడు సీలింగ్ భూములని చెప్పడం దుర్మార్గమని హరీశ్‌రావు మండిపడ్డారు.






