6 May, 2026 | 5:57 PM

కోనరావుపేటలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు –అన్నదాతల అవగాహన కార్యక్రమం

06-05-2026 05:25 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – అన్నదాతల అవగాహన” కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మస్కూరి కాశీరాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రైతులకు తక్కువ యూరియా వినియోగం, పంట మార్పిడి, సాగు నీటి సంరక్షణ, సేంద్రియ వ్యవసాయం, అవసరమైన మేరకే రసాయనాల వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

అలాగే వానాకాలంలో సన్న రకాల వరి సాగు చేసి ప్రభుత్వ బోనస్ పొందాలని, ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు మళ్లాలని సూచించారు. కార్యక్రమంపై రైతులు సానుకూలంగా స్పందించి తమ అభిప్రాయాలు వెల్లడించారు.