16 April, 2026 | 2:00 AM

అధ్వానంగా రైతు వేదికలు!

16-04-2026 12:38 AM
  1. నిధులు లేక కొరవడిన నిర్వాహణ

ఇబ్బందులు పడుతున్న రైతన్నలు

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఏప్రిల్ 15: ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కాకపోవడంతో రైతు వేదికల నిర్వహణ అధ్వానంగా మారుతున్నాయి. దీంతో రైతులు,వ్యవసాయ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.2024 - 25 సంవత్సరంలో నెలకు రూ.9వేల చొప్పున కేవలం 5 నెలలు మాత్రమే నిర్వహణ నిధులు మంజూరు చేశారు.నాటినుండి నేటి వరకు నిధులు మంజూరు కాని పరిస్థితి నెలకొంది.జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని తిమ్మాపురం,రామన్నగూడెం గ్రామాలలో రెండు రైతువేదికలను 2021 సంవత్సరంలో ఏర్పాటు చేశారు.

కానీ అప్పటినుండి నేటి వరకు వీటిని నిర్వహణ లేక శిధిలమవుతున్నాయి.అలాగే రైతు వేదికలో నీటి వసతి లేక మరుగుదొడ్లు పనిచేయడం లేదు.కిటికీలు లేక వేదికలు దుమ్ము,ధూళితో నిండిపోతున్నాయి.ఈ రెండు రైతు వేదికలను ఈసీ సెంటర్లుగా మార్చడంతో ప్రతి మంగళవారం రైతు వేదికలకు వచ్చే రైతులు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు.వేల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన రైతు వేదికలకు ఇప్పటికైనా ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని పలువురు రైతులు,రైతుసంఘం నాయకులు కోరుతున్నారు.

 వేదికలకు వసతులు కల్పించాలి తిమ్మాపురం గ్రామ రైతు వేదికలో కనీస వసతులు లేవు. త్రాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు పనిచేయడం లేదు.వెంట నే నీటి వసతి కల్పించి,రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి.

ఎల్లెంల అవిలయ్య, రైతుసంఘం మండల కార్యదర్శి, జాజిరెడ్డిగూడెం