8 నుంచి ఎస్‌ఏ 2 పరీక్షలు
04-04-2026 02:41 AM
1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు
హైదరాబాద్, ఏప్రిల్ 03 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థు లకు నిర్వహించే సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్‌ఏ2) పరీక్షలు ఈనెల 8 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. 1 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. తొలు త 10వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించాలనుకున్నారు.
కానీ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షల కారణంగా ఈ షెడ్యూల్లో మార్పులు చేశారు. ఒకటి నుంచి 7వ తరగతి విద్యార్థులకు ఉద యం 9 నుంచి 11.30 గంటల వరకు, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉద యం 9 నుంచి 11.45 గంటల వరకు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు మధ్యా హ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.




