4 April, 2026 | 4:28 AM

తుమ్మడి కుంటను సందర్శించిన సీఎం

04-04-2026 02:43 AM

చెరువు పునరుద్దణ పనులను పరిశీలించిన రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి) : మాదాపూర్‌లోని తుమ్మడి కుంట చెరువు పునురుద్దరణ ప నులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించారు. హైటెక్స్‌లో శుక్రవార జరిగిన టెక్స్‌టైల్ సదస్సులో పాల్గొని తిరిగొస్తుండగా, తుమ్మడి కుంటను సందర్శించి చెరువు పునురుద్దరణ పనుల పురోగతిని సీఎం తెలుసుకున్నారు. అక్రమణల కారణంగా తుమ్మడి కుంట చెరువు 14 ఎకరాలకు కుంచించుకుపోయింది. చెరువుల పునరుద్దరణలో భాగంగా అక్రమణలను తొలగించి 28.05 ఎకరాలకు విస్తరించారు. తుమ్మడి కుంట పునరుద్దరణ కోసం ప్రభు త్వం రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నది.