27 June, 2026 | 12:22 AM

కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

31-05-2025 04:11 PM

దుకాణల తనిఖీ చేసిన సీఐ సంతోష్ కుమార్

సదాశివనగర్,(విజయక్రాంతి): విత్తనాలు విక్రయించే వ్యాపారస్తులు కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ సీఐ సంతోష్ కుమార్ అన్నారు. శనివారం సదాశివ నగర్ మండలం కేంద్రంలో విత్తనాలు అమ్మే దుకాణాలను సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐ రంజిత్ కుమార్, మండల వ్యవసాయ అధికారి ప్రజా పతితో కలిసి తనిఖీ చేశారు. ఎవరు కూడా కల్తీ విత్తనాలు అమ్మకూడదని,అమ్మినచో చట్ట ప్రరమైన చర్యలు తీసుకుంటామని  తెలిపారు.