29 August, 2026 | 9:03 PM

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో సర్పంచ్

29-08-2026 05:39 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలంలోని మూకమామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని గుట్టగూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నూతనంగా నిర్మించిన ఇంటి గృహప్రవేశం శనివారం ఘనంగా జరిగింది. లబ్ధిదారు కాకా శ్రీదేవి–రమేష్ దంపతుల నూతన గృహాన్ని స్థానిక సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.మామిడి తోరణాలు, బంతిపూలతో అలంకరించిన ఇంటిలో కొబ్బరికాయ కొట్టి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, గుట్టగూడెం గ్రామంతో సహా మూకమామిడి పంచాయతీ పరిధిలో అన్ని గ్రామాలలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కనితి చిన్న వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు అనంతుల సత్యనారాయణ,గ్రామ పెద్ద సవలం సత్యనారాయణ లబ్ధిదారుల కుటుంబ సభ్యులు,మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.