calender_icon.png 20 January, 2026 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృత్రిమ గర్భాదారణ ద్వారానే మేలు జాతి పశు సంపద

20-01-2026 07:35:38 PM

-గోపాల మిత్ర సేవలు వినియోగించుకోవాలి

-డీఎల్డీఏ  సూపర్వైజర్  తుక్కారెడ్డి

కంగ్టి,(విజయక్రాంతి): రైతులు తమ పశువులలో ఎదలక్షణాలు గుర్తించి వాటికి కృత్రిమ గర్భధారణ టీకాలు వేయించినట్లయితే మేలు జాతి దూడలు పుడతాయని గోపాలమిత్ర సూపర్వైజర్ తుక్కా రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో  కంగ్టి మండల పరిధిలోని భోర్గి గ్రామంలో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరం పశువులకు గర్భస్థపరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా  రైతులకు పశుపోషణ వాటి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. అవసరమైన వాటికి తగిన మందలను అందజేశారు. లేగ దూడలకు నట్టల నివారణ మందులను వేశారు.