11-02-2025 01:09:27 AM
బిచ్కుంద ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం బిచ్కుంద పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా సాహెల్ శెట్కర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి సాహెల్ శెట్కర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా సాహెల్ శెట్కర్ మాట్లాడుతూ, ‘బిచ్కుంద పట్టణ అభివృద్ధికి కృషి చేస్తాను. నాయకులు కార్యకర్తలు నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు సేవలు అందిస్తాను‘ అని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ అప్ప, దడ్ది నాగ్నాథ్, పిసిసి డెలికేట్ విట్టల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్, సోపాన్ ,తదితరులు పాల్గొన్నారు.