సహ్యాద్రి.. కనువిందు
02-08-2026 12:00 AM
నిర్మల్, విజయక్రాంతి : నిర్మల్ జిల్లా కేంద్రానికి కుత వేటు దూరంలో మహబూబ్ ఘాట్ అడవుల్లోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తున్నది. మూడురోజులపాటు వర్షాలు కురవడంతో సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో ఎత్తున కొండల నుంచి జాలువారుతున్న జలాలను చూసేందుకు పెద్దఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. రానాపూర్ బీట్ పరిధిలో ఉన్న జలపాతాన్ని జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ సుఖదేవ్ బాపుడే శనివారం సందర్శించారు. ఈ జలపాతం వద్ద పర్యాటలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్య తీసుకుంటున్నామని తెలిపారు.






