2 August, 2026 | 1:20 AM

బోగతకు సందర్శకుల తాకిడి

02-08-2026 12:00 AM

జలపాతాన్ని సందర్శించిన మంత్రి సీతక్క

ములుగు, ఆగస్టు 1, (విజయక్రాంతి): ములుగు జిల్లాలో ప్రముఖ పర్యటక ప్రాంతమైన బోగత జలపాతం జల పరవళ్లతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బోగత జలపాతం పెద్ద ఎత్తున వరద రావడంతో సందర్శకులను అనుమతించలేదు. ఈ క్రమంలో శనివారం వరద కొంత తగ్గుముఖం పట్టడంతో సందర్శకులను అనుమతించారు.

శనివారం రాష్ట్రమంత్రి సీతక్క బొగత జలపాతాన్ని సందర్శించారు.పర్యాటకులు అధికారుల సూచన మేరకు రక్షణ చర్యలు పాటించాలని కోరారు. పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గోదావరి నది ప్రవాహం శనివారం కొంత తగ్గుముఖం పట్టింది.

ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట గోదావరి పరివాహక ప్రాంతంలో వరద ఉధృతి శనివారం సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని, ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టొప్పో, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు.