4 April, 2026 | 4:18 AM

మిథిక్ సైఫై నేపథ్యంలో కొత్త సినిమా

04-04-2026 02:40 AM

సాయిదుర్గతేజ్ కొత్త సినిమాను ప్రకటించారు. విభిన్నమైన కథలతో ముందుకు సాగుతున్న సాయిదుర్గాతేజ్ హీరోగా నటిస్తున్న 19వ సినిమా ఇది. ఈ భారీ ప్రాజెక్టును షైన్‌స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ‘క’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుజిత్, సందీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మిథిక్ సై-ఫై నేపథ్యంలో హై-ఆక్టేన్ కథనాన్ని మిళితం చేసే కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోందీ దర్శక ద్వయం. ‘యుగాలుగా బయటకు రాని రహస్యాలు, ఊహకు అందని శక్తులు’ చుట్టూ తిరిగే కథతో ఈ కొత్త సినిమా రానుందంటూ ఫస్ట్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ పోస్టర్‌లో ఒక యోధుడు విస్తారమైన ఆకాశ గోళాల ముందు నిలబడి ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.