4 April, 2026 | 4:18 AM

తెలుగులో వీరభద్రుడుగా

04-04-2026 02:42 AM

సూర్య హీరోగా దర్శకుడు ఆర్‌జే బాలాజీ తెరకెక్కిస్తున్న మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘కరుప్పు’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై, అందరిలో అంచనాలను పెంచేసింది.

ఇదిలావుండగా, ఈ చిత్రానికి తెలుగులో ‘వీరభద్రుడు’ అనే టైటిల్ పెట్టారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ శుక్రవారం విడుదల చేసిన పోస్టర్‌లో సూర్య శక్తిమంతమైన అవతార్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి అభ్యంకర్; సినిమాటోగ్రఫీ: జీకే విష్ణు; యాక్షన్: అన్బరివ్, విక్రమ్ మోర్; ఎడిటర్: ఆర్ కళైవానన్; ప్రొడక్షన్ డిజైన్: అరుణ్ వెంజారామూడు; నిర్మాతలు: ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు; రచనాదర్శకత్వం: ఆర్‌జే బాలాజీ.