11 May, 2026 | 1:27 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

కరాటేలో గోల్డ్, సిల్వర్ మెడల్ తో అదరగొట్టిన సాయి సంతోష్

05-02-2025 04:03 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): ఇటీవలే ముంబైలో జరిగిన కరాటే పోటీలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కు చెందిన సాయి సంతోష్ పసిడి, రజత పథకాలు సాధించి హుజురాబాద్ ఖ్యాతి దేశవ్యాప్తంగా చాటాడు. ముంబైలోని హుజురాబాద్ పట్టణానికి చెందిన జూపాక పల్లవి, హరిప్రసాద్ ల కుమారుడు సాయి సంతోష్ ముంబైలోని ప్రియదర్శిని ఇండోర్ స్టేడియంలో వరల్డ్ పులకాశి శోటోఖాన్ కరాటే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన కరాటే పోటీలో ఈ ఘనత సాధించాడు. 14 సంవత్సరాల లోపు విభాగంలో పాల్గొన్న సాయి సంతోష్ కటాలో స్వర్ణం సాధించగా, స్పారింగ్ లో సిల్వర్ మెడల్ సాధించాడు. కరాటేలో పథకాలు సాధించి హుజురాబాద్ పట్టణానికి వన్నెతెచ్చినందుకు కరాటే మాస్టర్ బాబురావు, హుజురాబాద్ పట్టణ సీఐ తిరుమల గౌడ్ తో పాటు పలువురు  అభినందించారు.