26 June, 2026 | 1:46 AM

హ్యాట్రిక్ విక్టరీతో నాకౌట్‌కు మెక్సికో

26-06-2026 12:14 AM

మెక్సికో సిటీ, జూన్ 25 : సాకర్ ప్రపంచకప్‌లో మెక్సికో సరికొత్త చరిత్ర సృష్టించిం ది. గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లూ గెలిచిన జట్టుగా రికార్డులకెక్కింది. మెక్సికో సిటీ స్టేడి యం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 3 తేడాతో చెకియాపై విజయం సాధించింది.

పూర్తి ఆధిపత్యం కనబరిచిన మెక్సికో కు చెకియా ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. 55వ నిమిషంలో లూయిస్ ఇచ్చిన పాస్‌ను చావెజ్ గోల్‌గా మలిచాడు. మరో ఐదు నిమిషాలకే డిఫెండర్ క్వినోనెస్ మరో గోల్ కొట్టి ఆధిక్యాన్ని 2 పెంచాడు. ఆట కొన్ని నిమిషాల్లో ముగుస్తుందనగా అ ల్వారో గోల్ కొట్టి 3 విజయాన్నందించాడు. ఈ విజయంతో నాకౌట్ చేరిన మెక్సికో స్కాట్లాండ్‌తో తలపడుతుంది.