30 June, 2026 | 11:59 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

సాయి సూర్య వెంచర్‌లో.. గ్రామ పంచాయతీ పది శాతం భూమి మాయం..!

19-06-2025 12:26 AM

భూమిని తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు

మనోహరాబాద్(తూప్రాన్), జూన్ 18 : మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ గ్రామంలోని సాయి సూర్య వెంచర్ లో గ్రామ పంచాయతీకి కేటాయించిన పది శాతం స్థలం కబ్జాకు గురైంది. ఈ విషయాన్ని గ్రామంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ మండల సంబంధిత డీఎల్పిఓ, తహసీల్దార్కు పూర్తి వివరాలను సేకరించాలని ఆదేశాలను జారీ చేశారు.

దీంతో కాళ్ళకాల్ గ్రామ పంచాయతీలో బుధవారం డిఎల్పిఓ, తహసీల్దార్ సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని అధికారులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు, పూర్తి వివరాలను ప్రజల సమక్షంలో బహిర్గతంగా చర్చించుకొని ఎక్కడ లోపాలు ఏర్పడ్డాయో తక్షణమే వాటిని సరిచేసి కోల్పోయిన పది శాతం భూమిని తిరిగి స్వాధీన పరచుకోవాలని గ్రామ సెక్రటరీకి ఆదేశించారు.

జరిగిన లోపాలను తక్షణమే సరి చేయాలని లేని పక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సెక్రటరీకి సూచించారు. ఈ కార్యక్రమంలో జగ్గం ప్రభాకర్ గౌడ్ గురు స్వామి, అచ్చగోని ప్రభాకర్, మాజీ సర్పంచ్ నత్తి మల్లేష్, వెంకటేశం, మాజీ వార్డు సభ్యులు, పలువురు నాయకులు, ప్రజలుపాల్గొన్నారు.