22 March, 2026 | 8:56 AM

శింబుతో సై

28-10-2024 12:00 AM

ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అది ఉంటే చాలు హిట్, ఫట్‌లతో సంబంధం లేకుండా దూసుకెళతారు. కథానాయిక మీనాక్షి చౌదరికి అదృష్టం కాస్త కాదు.. బాగా ఉన్నట్టుంది. అందుకే అమ్మడి కెరీర్ జెట్ స్పీడ్‌లో పరుగులు పెడుతోంది. ‘గుంటూరు కారం’, ‘సింగపూర్ సెలూన్’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత కాలం బాగా కలిసొచ్చింది.

‘లక్కీ భాస్కర్’, ‘మెకానిక్ రాకీ’, ‘మట్కా’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండటమే ఇందుకు ఉదాహరణ. ఇవే కాకుండా చిరంజీవితో ‘విశ్వంభర’లోనూ అవకాశం కొట్టేసింది. ఇంత తక్కువ టైంలోనే చిరు చిత్రంలో అవకాశం పొందడమంటే మాటలా?! ఇది చాలదన్నట్టు మరికొన్ని ప్రాజెక్టులకు సైతం మీనాక్షి సైన్ చేసినట్టు సమాచారం.

వాటి షూటిం గుల్లో త్వరలోనే పాల్గొనబోతోందట ఈ సొగసరి. ఇక తాజాగా అశ్వత్ మారిముత్తు చెప్పిన కథను కూడా మీనాక్షి చౌదరి ఓకే చెప్పేసిం దని కోలీవుడ్ టాక్. ఈ చిత్రంలో శింబు హీరోగా నటిస్తున్నారట. ‘విశ్వంభర’ తర్వాత ఈ ముద్దుగుమ్మ మరింత బిజీ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.