అమరన్ రియల్ హీరో స్టోరీ
హీరో శివకార్తికేయన్ బహు భాషా బయోగ్రాఫికల్ యాక్షన్ చిత్రం ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్నారు. సాయిపల్లవి ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్నారు. నితిన్ ఫాదర్ సుధాకర్‌రెడ్డి, సిస్టర్ నిఖితరెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా విడుదల చేయనున్నారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. డైరెక్టర్ నాగ్‌అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. “అమరన్’ చాలా వండర్‌ఫుల్ స్టోరీ. రియల్ స్టోరీ తీసినప్పుడు చాలా బాధ్యత ఉంటుంది. కొన్నిసార్లు ఇలాంటి రియల్ స్టోరీ చెప్పడం చాలా అవసరం.
సాయిపల్లవికి నేను కూడా ఫ్యాన్‌ని. శివ కార్తికేయన్ డాక్టర్ సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు. హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. ‘ఇదొక రియల్ హీరో స్టోరీ. మేజర్ ముకుంద్ వరదరాజన్, ఇందు రెబెకా నిజ జీవిత కథ’ అన్నారు.
“నేను చేసే ప్రతి సినిమా ప్రేక్షకులకు నచ్చాలని చాలా అంకితభావంతో పనిచేస్తాను. ‘అమరన్’ రియల్ సోల్జర్ జర్నీ” అని సాయిపల్లవి తెలిపారు. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మాట్లాడుతూ.. ‘ఇది నేషనల్ వైడ్‌గా సెలబ్రేట్ చేసుకునే సినిమా’ అని తెలిపారు. జోగయ్య శాస్త్రి, ఇతర చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




