18 June, 2026 | 10:32 AM

హాస్పిటల్ నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్

21-01-2025 05:40 PM

ముంబై,(విజయక్రాంతి): ప్రముఖ బాలీవుడు నటుడు సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రి నుండి మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. జనవరి 16 తెల్లవారుజామున బాంద్రాలోని తన నివాసంలో ఓ దుండగుడు చోరబడి నటుడిపై దాడికి పాల్డడాడు. ఈ దాడిలో ఖాన్ కు మూడు గాయాలు కాగా, రెండు చేతిపై ఒకటి మెడ కుడి వైపున  కత్తిపోట్లకు గురైన సైఫ్ అలీ ఐదు రోజుల పాటు అత్యవసర శస్త్రచికిత్స అందుకొని ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. ఖాన్ కు వారంపాటు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు.

వైద్యులు వెన్నెముకలో చిక్కుకున్న పదునైన కత్తిని తీసివేశారు. సైఫ్ ఇంటికి చేరుకున్నారు. ఆయన వెంట తల్లి, నటి షర్మిలా టగూర్, సతీమణి కరీనా కపూర్, కుమార్తె సారా అలీఖాన్ తదితరులు ఉన్నారు. సైఫ్ వేగంగా కోలుకోవడంపై ఆయన సోదరి సబా పటౌడీ ఆనందం వ్యక్తం చేస్తూ డిశ్చార్జ్ కు ముందే, తన సోదరిడితో కలిసి మళ్లీ సమయం గడపడం సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కత్తిపోటు సంఘటనకు సంబంధించి కేసును ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు పొరుగున ఉన్న థానే నగరానికి చెందిన బంగ్లాదేశ్ జాతీయుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ (30)ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.