రైతన్న షాపును ప్రారంభించిన మంత్రులు
19-08-2026 07:19 PM
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రైతన్న ఎంటర్ప్రైజెస్ షాప్ ను రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ విప్ , పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు లు బుధవారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ , మున్సిపల్ వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, అంతటి లక్ష్మణ్, అంతటి సాగర్ పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.






