సుల్తానాబాద్ లో ఘనంగా మంత్రులకు స్వాగతం
19-08-2026 07:09 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గంలో రూ.280 కోట్ల నిధులతోసుల్తానాబాద్ పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , తుమ్మల నాగేశ్వర రావు లకు మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరి మహేందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని శాస్త్రి నగర్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో జరిగిన భారీ బహిరంగ సభ వరకు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలతో కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని ర్యాలీ నిర్వహించి మంత్రులకు ఘన స్వాగతం పలికారు, ఈ కార్యక్రమంలో సాయిరీ మహేందర్ వెంట బండ గోపాల్ , గందె రాజు, తుమ్మ రాములు, పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు.






