19 August, 2026 | 8:08 PM

సజావుగా సర్వసభ్య సమావేశం

19-08-2026 07:24 PM

అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి

మండలం ప్రత్యేక అధికారి రాధా రాణి

రాజాపూర్: గ్రామాల అభివృద్ధిపై అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని మండలం ప్రత్యేక అధికారి రాధా రాణి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ముందుగా వివిధ గ్రామాల సర్పంచులు తమ గ్రామాలలోని సమస్యలను సభా దృష్టికి తీసుకొచ్చారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలు సర్పంచ్లకు సమాచారం ఇవ్వడం లేదని సభా దృష్టికి తెచ్చారు. అలాగే గ్రామాలలో మిషన్ భగీరథ వాటర్ సప్లై అరకొరగా ఉందని తెలిపారు.

అలాగే గ్రామాలలో ఇండ్లపై విద్యుత్తు తీగల సమస్య చాలా ఉందని సర్పంచులు సభకు విన్నవించారు. అనంతరం ప్రత్యేక అధికారి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి సమిష్టిగా పని చేస్తేనే గ్రామాలలో సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని సూచించారు. అధికారులు సమస్యలపై పూర్తిస్థాయిలో నివేదికలు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్,వివిధ శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.