30 August, 2026 | 5:54 PM

నేడు ఎడ్‌సెట్ ఫలితాలు

11-06-2024 02:27 AM

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): బీఎడ్ రెండేళ్ల కోర్సులో ప్రవేశాలకు 2024 25 విద్యాసంవత్సరానికి నిర్వహించే టీజీ ఎడ్‌సెట్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ విధా నంలో మే 23న ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 33,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, సెషన్ 14,633 మంది, సెషన్ 14,830 మంది అభ్యర్థులు హాజరయ్యారు.