16 July, 2026 | 11:06 AM

టైమ్స్ జాబితాలో సాక్షి మాలిక్

18-04-2024 01:22 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: భారత స్టార్ మహిళా రెజ్లర్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌కు అరుదైన గౌర వం దక్కింది. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో సాక్షి మాలిక్ చోటు దక్కించుకుంది. కాగా భారత్ నుంచి టైమ్ మ్యాగజైన్‌లో చోటు సంపాదించిన ఏకైక మహిళా రెజ్లర్‌గా సాక్షి మాలిక్ నిలిచిం ది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతి రేకంగా ఆందోళన చేపట్టిన వారిలో సాక్షి మాలిక్ ముందువరుసలో నిలిచింది. టైమ్ మ్యాగజైన్‌లో చోటు దక్కించుకున్న వారిలో ఆలియా భట్, యాక్టర్ దేవ్ పటేల్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల ఉన్నారు.