16 July, 2026 | 10:55 AM

‘ధోని, కోహ్లిలా ప్రయత్నించా’

18-04-2024 01:24 AM

కోల్‌కతా: తాజా సీజన్‌లో రెండో సెంచరీ నమోదు చేయడంతో పాటు.. ఆశ లే లేని స్థితి నుంచి రాజస్థాన్‌కు విజయాన్నంది ంచిన బట్లర్.. టీమిండి యా మాజీ కెప్టెన్లు మహే ంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలే స్ఫూరతి అని అన్నా డు. కోల్‌కతాపై ఉత్కంఠ విజయం అనంతరం బట్లర్ మాట్లాడుతూ.. ‘ఎన్నో సందర్భాల్లో ధోని, కోహ్లీలు ఆఖరి వరకు నిలిచి జట్టుకు విజయాలు అందించిన వారే. కోల్‌కతాలో మ్యాచ్‌లో వారిని స్పూర్తిగా తీసుకొని నేను దానినే అనుసరించా.. ఫలితం అనుకూలంగా వచ్చింది. అంతే కాదు ఓపికతో ఆడితే ఎక్కడో ఒక చోట బ్రేక్ పాయింట్ దొరుకుతుందని మా జట్టు డైరెక్టర్ కుమార సంగక్కర ఎప్పుడూ చెప్తుంటాడు. అతడి సూచనలు వర్కౌట్ అయ్యాయి. సమయం కోసం వేచి చూసి బౌలర్లపై ఎదురుదాడికి దిగాను. నా కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో దీనికి కచ్చితంగా చోటు ఉంటుంది’ అని పేర్కొన్నాడు.  

శ్రేయస్‌కు జరిమానా

హోరాహోరీ పోరులో చివరి బంతికి రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి బాధలో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా.. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ఫీజులో రూ.12 లక్షలు కోత విధించారు. నిర్ణీత సమయంలో కోల్‌కతా ఒక ఓవర్ తక్కువ వేసినందుకు గానూ ఐపీఎల్ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది. తాజా సీజన్‌లో ఢిల్లీ కెప్టెన్ పంత్ రెండుసార్లు, గుజరాత్ కెప్టెన్ గిల్, రాజస్థాన్ కెప్టెన్ శాంసన్ ఒక్కోసారి స్లో ఓవర్ రేట్ బారీన పడ్డారు. ఐపీఎల్ నియమావళి ప్రకారం తొలిసారి స్లో ఓవర్ రేట్‌కు పాల్పడితే కెప్టెన్ మ్యాచ్ ఫీజులో రూ. 12 లక్షలు, రెండోసారి చేస్తే కెప్టెన్ మ్యాచ్ ఫీజులో రూ. 24 లక్షలు జరిమానా విధిస్తారు.