13 March, 2026 | 7:13 PM

ఘనంగా సమతా సైనిక్ దళ్ ఆవిర్భావ దినోత్సవం

13-03-2026 06:38 PM

వాంకిడి,(విజయక్రాంతి): సమతా సైనిక్ దళ్ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళ్ సభ్యులు కవాతు నిర్వహించి బాబాసా హెబ్ చిత్రపటానికి సెల్యూట్ చేశారు. జిల్లా అధ్యక్షుడు దుర్గం సందీప్ మాట్లాడుతూ... 1927 మార్చి 13న డా.బి.ఆర్. అంబేద్కర్ సమాజంలో కుల అసమానతలు నిర్మూలన, సామాజిక న్యాయం సాధన లక్ష్యాలతో సమతా సైనిక్ దళ్‌ను స్థాపించినట్లు తెలిపారు.

సమానత్వం, సోదరత్వం, స్వేచ్ఛ విలువలను స్థాపించడం, దళిత– బహుజ నుల్లో ఆత్మగౌరవం, క్రమశిక్షణ పెంపొందించడం సంస్థ ముఖ్య లక్ష్యాలని పేర్కొన్నారు. భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు మహుర్కర్ అశోక్ మాట్లాడుతూ... యువతలో శారీరక దారుఢ్యం, సామాజిక అవగాహన పెంపొందించేందుకు శిక్షణా శిబిరాలు, ఉపన్యాసాలు, అధ్యయన వర్గాల ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు దుర్గం దుర్గాజీ యువత సమతా సైనిక్ దళ్‌లో చేరి సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రోషన్ ఉప్రె, రమేష్ డోంగ్రే, శ్యాంరావు లహు దుర్గం, మిలింద్, వెంకటేష్, బుద్ధజి, సాజన్, సుశీల్, సచిన్, తరుణ్, రితేష్, ఆకాష్, స్వాగత్, ప్రశాంత్, నవీన్, శ్రీకాంత్, అజయ్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.