పది పరీక్షలకు సర్వం సిద్ధం
* 14 మార్చి నుంచి 15 ఏప్రిల్ వరకు
* విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేసిన ఎంఈఓ చత్రు నాయక్
గరిడేపల్లి,(విజయక్రాంతి): నేటి నుండి ఏప్రిల్ 15 వరకు నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి పానుగోతు ఛత్రు నాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన మండల కేంద్రమైన గరిడేపల్లిలో జడ్పిహెచ్ఎస్, కేజీబీవీ పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. జడ్పిహెచ్ఎస్ కేంద్రంలో 130, కేజీబీవి కేంద్రంలో 107 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
రెండు కేంద్రాల్లో సిఎస్‌లు, డీఓలు, ఇన్విజిలేటర్లు ఇతర సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగ కేజీబీవీ విద్యార్థులతో మాట్లాడుతూ పరీక్షలను ధైర్యంగా రాసి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు హాల్ టికెట్లను పంపిణీ చేశారు. అలాగే ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ సూపరింటెండెంట్లు రవీందర్ రెడ్డి, లింగయ్య, డీఓలు సత్యనారాయణ, శ్రీరామ్ రెడ్డి, ఎస్‌ఓ శైలజ, సిఆర్‌పి సాయిలు, రాతికింది రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.




