6 June, 2026 | 5:05 PM

ఇసుక కొరతను నివారించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

06-06-2026 03:58 PM

అటవీ అధికారుల దాడులు ఆపి పోడు సాగుకు వీలు కల్పించాలి

అధిక ధరలపై 10న జరిగే ధర్నాను జయప్రదం చేయాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

పాల్వంచ,(విజయక్రాంతి): ఇసుక కొరతను నివారించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చెయ్యాలని సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా కోరారు. శనివారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ లో సీపీఐ పాల్వంచ మండల విస్తృత కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇసుక కొరత వలన అభివృద్ధి పనులు, ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం, ఇతర నిర్మాణాలకు ఇసుక ప్రధాన సమస్యగా ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం స్థానికంగా ప్రజల అవసరాలకు ఇసుకను సరఫరా చేసే విధంగా ప్రణాళికలు చేయాలని కోరారు.

వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు జిల్లా వ్యాప్తంగా పోడు సాగుదారులపై దాడులు చేసి ఇబ్బందులకు గురి చేయొద్దని, పోడు భూములు సాగు చేసుకునే విధంగా వీలు కల్పించాలని కోరారు.  రైతులు పండించిన పంటను షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో వద్ద సరిపడా కాటాలు, గోని సంచులు, హమాలీలను, లారీలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ అధికారులను కోరారు.

నిత్యం గ్రామాలలో ప్రజలతో మమేకమవుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన తెచ్చుకొని సమస్యల పరిష్కారానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని తద్వారా పార్టీ మరింత అభివృద్ధి చెందటానికి దోదపడాలని కోరారు. ధరలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టి సామాన్యులకు అందుబాటులో ధరలు ఉండే విధంగా ధరల పెరుగుదలపై నియంత్రణ చేయాలని డిమాండ్ చేశారు. అధిక ధరలపై ఈనెల 10వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వేలాదిమంది ప్రజలతో ధర్నా నిర్వహించబోతున్నట్లు తెలిపారు.