2 September, 2026 | 12:13 AM

ఇసుక టిప్పర్ పట్టివేత

01-09-2026 | 11:39pm

మాగనూరు: అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు మాగనూరు ఎస్సై అశోక్ బాబు తెలిపారు. మంగళవారం మాగనూరు మండల పరిధిలోని అమ్మపల్లి గ్రామ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమముగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పును పోలీస్ స్టేషన్ కు తరలించి టిప్పర్ డ్రైవర్ ను విచారించగా దండు నరసింహ, గుడేబల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు. ఇసుక తరలింపునకు ఎలాంటి అనుమతులు, పర్మిషన్ లేకపోవడంతో నిబంధనల ప్రకారము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అశోక్ బాబు తెలిపారు.