2 September, 2026 | 1:19 AM

పెంకుటింటికి రూ.లక్ష కరెంట్ బిల్లా?

02-09-2026 | 12:08am
  1. షాక్‌కు గురైన లబ్ధిదారురాలు 
  2. ములుగులోని ప్రేమనగర్‌లో ఉదంతం 

ములుగు, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): ములుగు(Mulugu)లోని ప్రేమనగర్‌కు చెందిన కొమ్మినేని ప్రమీల(Kommineni Pramila) ఇంటికి విద్యుత్‌శాఖ(Electricity Department) ఏకంగా 1.43 లక్షల రూపాయల బిల్లును వేసి ఆమెకు షాక్ ఇచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం కొద్ది నెలలుగా కరెంటు బిల్లు(electricity bill) ఇవ్వడం లేదని, ఇప్పుడు ఏకంగా టక్షా 43 వేల బిల్లు చెల్లించాలంటూ విద్యుత్ శాఖ సిబ్బంది చెప్పారన్నారు. తమ ఇంటిలో ఫ్రిడ్జ్, ఫ్యాన్లు, లైట్లు మాత్రమే ఉన్నాయని వీటికి ఇంత పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లు ఎలా వచ్చిందంటే సమాధానం చెప్పకుండా బిల్లు కట్టాల్సిందేనని తమపై ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు.

ఈ విషయంపై ములుగు ఎన్పీడీసీఎల్ డీఈని వివరణ కోరగా కరెంటు మీటర్‌లో సాంకేతిక లోపం కారణంగా బిల్లు అధికంగా వచ్చిందని, ఈ విషయం తమ దృష్టికి రాగానే మీటరుకు సాంకేతిక పరీక్షలు నిర్వహించామని చెప్పారు. వారి ఇంటి విద్యుత్ వినియోగం లోడును బట్టి 13 వేల రూపాయలు మాత్రమే బిల్లు చెల్లిస్తే సరిపోతుందన్నారు. సదరు విద్యుత్ వినియోగదారులు గృహలక్ష్మి పరిధిలో లేరన్నారు.