08-12-2025 12:00:00 AM
సుల్తానాబాద్, డిసెంబర్ 7 (విజయ క్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్ లో నూతనంగా ని ర్మించిన శ్రీ శ్రీ శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ను ఆదివారం సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీ నివాస్ దంపతులు దర్శించుకున్నారు.
ఈ సందర్భంగాదేవాలయం ట్రస్టు వ్యవస్థాపకులు , చైర్మన్, గురుస్వామి సాయిరి మ హేందర్ సమీప బంధువు అయినటువంటి సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ అ య్యప్ప స్వామి ఆలయం 8 నెలలోనే తక్కు వ సమయంలో ఇంత అద్భుతంగా నిర్మించిన సాయిరి పద్మ మహేందర్ దంపతుల సేవలు మరువలేనివి అని అభినందించా రు.
. అనంతరం అయ్యప్ప స్వామి దేవాలయంలో... శ్రీ అభయ ఆంజనేయ స్వామి దే వాలయంలో ప్రత్యేక పూజలు చేశారు... సాయిరీ మహేందర్ సంగీతం శ్రీనివాస్ దం పతుల ను ఘనంగా సన్మానించారు... ఈ కార్యక్రమంలో స్పోరట్స్ క్లబ్ అధ్యక్షులు ము స్త్యాల రవీందర్, ఆలయ భక్త బృందం పాల్గొన్నారు.