08-12-2025 12:00:00 AM
జిల్లావ్యాప్తంగా ఇదే తంతు
సమితి సింగారంఫై ఎమ్మెల్యే పాయం, మాజీ ఎమ్మెల్యే రేగా ప్రధాన దృష్టి
అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత ప్రచారాలు
మణుగూరు, డిసెంబర్ 7,( విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు పల్లెల్లో హడావుడి చేస్తున్నారు. వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులు కోవడం లేదు. సర్వశక్తులు ఒడ్డుతూ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మద్దతుదారులకు మందు, విందులు ఇవ్వడ ం, ప్రత్యర్థి వర్గాలను తమ వైపునకు తిప్పుకోవడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. బ రిలో ఉన్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పా వులు కదుపుతున్నారు.
ముమ్మరంగా సాగుతున్న ప్రచారం..
మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో మూడవ రోజు ప్రచారం ముమ్మరం గా సాగుతుంది. సమితి సింగారం,లంక మ ల్లారం, ముత్యాలమ్మ నగర్, కూనవరం, వి ప్పలసింగారం, పగిడేరు గ్రామ పంచా యతీలలో ప్రచారపర్వం మరింతగా వేగం పుంజుకుంది. మేజర్ గ్రామ పంచాయతీ సమితి సింగారంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విస్తృతం గా పర్యటించి తమ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.
జడ్పీ హైస్కూల్లో ఉదయాన్నే వాకర్స్ కలిసి సమితి సింగారంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి గుండి గౌరీని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అభ్యర్థించారు. మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల విజయం కోసం మాజీ జెడ్పిటిసి పోశం నరసింహారావు, మండల అధ్యక్షుడు కుర్రీ నాగేశ్వరరావు కూ నవరం, ముత్యాలమ్మ నగర్ లలో ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థుల పక్షాన సిపిఎం, బీఆర్‌ఎస్ నాయకులు, పలువార్డులలో ప్రచారాలను నిర్వహించారు.
కూనవరం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఏనిక శ్వేత గెలుపు కోసం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వ ర్లు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశా రు. సమితి సింగారం మేజర్ పంచాయతీ అ భ్యర్థి మాధవరావు ను గెలిపించాలని ఎ మ్మెల్యే తో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం చేశారు. అలాగే పూజారీ నగర్, రాజీవ్ గాంధీ నగర్, సాయినగర్, అశోక్ నగర్ ఏరియాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాధ వరావు ఓటర్లను కలిసి బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
సింగారంలో భారతి విస్తృత ప్రచారం
తెలుగుదేశం అభ్యర్థి బచ్చల భారతి పంచాయతీలో ఇంటింటి పర్యటన చేశారు. పర్సు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని, విజ్ఞప్తి చేశారు. సింగారం పంచాయతీ బరి లో ఉన్న టీడీపీ అభ్యర్థి బచ్చల భారతి కి మద్దతిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ నేత గురజాల గోపి ప్రకటించారు.
రేపటి నుండిభా రతి గెలుపు కోసం అక్షర మహిళా మండలి సభ్యులు పంచాయతీల విస్తృత ప్రచారం నిర్వహించి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపు నివ్వడంతో భారతి ఎన్నికల ప్రచారం మరింత జోరందుకో నున్నది.
ఆమె గెలుపు కోసం సిపిఎం కాంగ్రెస్ నాయకులు నిరంతరం ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నారు. మరివైపుకూనవరంలో బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థి సకిని అశ్విని గెలుపు కోసం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేత ఊకంటి ప్రభాకర్ పలు కార్మిక వాడలలో కార్మికులు బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి ప్రచారం చేశారు.
సాయంత్రం వేళలలో ప్రచారం..
పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు సాయంత్రం వేళల్లో ప్రచారంపై ప్రత్యేకదృష్టిని సారిస్తున్నారు. పొద్దంతా పొ లం బాట పడుతున్నావారిని రాత్రివేళల్లో కలసి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఉద యం, రాత్రి వేళలోనే గ్రామాల్లో ఎన్నికల ప్రచారం సందడి కని పిస్తుంది.