12 March, 2026 | 4:58 PM

బ్యాట్ పట్టిన ఎమ్మెల్యే

12-03-2026 02:54 PM

క్రికెట్ పోటీలను ప్రారంభించిన కోవ లక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో విలేజ్ లెవల్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Lakshmi ) బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పి ఏ సి ఎస్ మాజీ వైస్ చైర్మన్ రంగు మహేష్ గౌడ్ తండ్రి స్వర్గీయ రంగు వెంకటి గౌడ్ జ్ఞాపకార్థం పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.

క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యతతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. గెలుపు-ఓటములను సమానంగా స్వీకరిస్తూ ముందుకు సాగాలని యువతకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి,  సర్పంచ్ దుర్గం భరద్వాజ్, ఉపసర్పంచ్ వరలక్ష్మి దుర్గారావు, మాజీ సింగిల్ విండో చైర్మన్ కర్నాతం సంజీవ్, మధునయ్య, తిరుపతి, బోర్కుటె తిరుపతి, బుర్స పోచమల్లు, బొమ్మినేని శ్రీధర్, సంఘం శ్రీను, ప్రభాకర్, ఆనంద్, వినోద్ జైస్వాల్, శంకరమ్మ, పద్మ, ఉబెదుల్లా, సాయి తదితర ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, క్రీడాకారులు, యువత పాల్గొన్నారు.